¡Sorpréndeme!

Mitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

2025-04-17 0 Dailymotion

 నన్ను రెచ్చగోక్కు  అని అప్పట్లో ఓ ఆడియో వైరల్ అయ్యింది కదా. అచ్చం నిన్న జైశ్వాల్ చేసింది అదే. నన్ను రెచ్చగోక్కు అని స్టార్క్ అంటున్నా వినకుండా తన పాత రైవల్రీ రుచి చూపిద్దాం అనుకున్నాడు. 189 పరుగులు ఛేజింగ్ లో స్టార్క్ ను ఓ ఆట ఆడుకున్నాడు యశస్వి జైశ్వాల్. స్టార్క్ వేసిన రెండో ఓవర్ ను ఫేస్ చేసి జైశ్వాల్...వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ తో విరుచుకుపడ్డాడు. జైశ్వాల్ నుంచి ఆ ఎటాక్ ఊహించలేకపోయిన స్టార్క్ రెండు వైడ్లు కూడా వేశాడు ఫ్రస్ట్రేషన్ లో. వీళ్లిద్దరి గొడవ ఇప్పుడు కాదు మొన్న ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అప్పుడు మొదలైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ ను ఆ వేగం సరిపోవట్లేదని చాలా స్లోగా వేస్తున్నావని రెచ్చగొట్టాడు జైశ్వాల్. ఆ తర్వాత స్టార్క్ కూడా జైశ్వాల్ వికెట్ తీశాడు లేండీ అది వేరే విషయం. అలా మొదలైన ఈ క్యూట్ రైవల్రీ నిన్న కూడా కొనసాగింది. స్టార్క్ ను టార్గెట్ చేసి జైశ్వాల్ కొడితే ఉడుక్కుమోత్తనంలో రగిలిపోయిన స్టార్క్ తన మూడు, నాలుగు ఓవర్లలో ర్యాంప్ ఆడించేశాడు అంతే. చాలా ఈజీ మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్ ను తన రివర్స్ స్వింగ్ టాలెంట్ తో తిరిగి ఢిల్లీ చేతుల్లోకి లాకొచ్చేశాడు. తన మూడో ఓవర్ లో 8 పరుగులు ఓ వికెట్..తన చివరి ఓవర్ లో 8 పరుగులు ఓ వికెట్ తీశాడు స్టార్క్. దెబ్బకు రాజస్థాన్ చేతుల్లో ఉన్న మ్యాచ్ కాస్తా టై అయ్యి సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్ లోనూ తనే బౌలింగ్ చేసి11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు నేల కూల్చాడు. ఇదే జైశ్వాల్ ను రనౌట్ కూడా చేసి యువర్ రన్నింగ్ టూ స్లో అన్నట్లు ఓ లుక్ కూడా ఇచ్చాడు స్టార్క్. అలా రాజస్థాన్ లోనూ ప్రతీదశలోనూ  అడ్డుకుని 35ఏళ్ల వయస్సులో రివర్స్ స్వింగ్ బౌలింగ్ తో జోరు చూపిస్తూ జైశ్వాల్ మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ గానే కసి తీర్చుకున్నాడు స్టార్క్. జైశ్వాల్ రెచ్చగోకితే... స్టార్క్ ఇలా చావు దెబ్బతీశాడన్నమాట. బట్ వీళ్లిద్దరి రైవల్రీ చాలా బాగుంటోంది. క్యూట్ గా కూడా ఉంటోంది.